బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి : అరవింద్ స్వామి

ABN , First Publish Date - 2020-03-12T05:50:20+05:30 IST

చట్టసభలో బీసీలకు 50 శాతం రిజ ర్వేషన్‌ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిం ద్‌స్వామి అన్నారు. పట్టణంలోని శ్రీవిద్య డిగ్రీ

బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి : అరవింద్ స్వామి

కొత్తకోట, మార్చి 11: చట్టసభలో బీసీలకు 50 శాతం రిజ ర్వేషన్‌ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిం ద్‌స్వామి అన్నారు. పట్టణంలోని శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో విద్యా ర్థులతో బుధవారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల భారతవనిలో బీసీల అభివృద్ధికి చట్టసభలో శాసనాలు చేయడం లేదన్నారు. ఉద్యమాల వత్తిడి కారణంగా శాసనం చేసిన అమలైన దాఖలాలు లేవన్నారు. ఎంపీ, ఎమ్యేల్యేలు లేని కారణంగా బీసీ గోడు వినే నాథుడే కరువయ్యా రన్నారు.


56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కృష్ణయ్య చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వి ద్యార్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మండల కమిటీ కన్వీనర్‌గా నవీన్‌, మహిళా కమిటీ కన్వీనర్‌గా తేజస్వినిలను ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌ ఆంజనేయులు, గోపాల్‌, మారుతి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T05:50:20+05:30 IST