యాసంగికి సాగునీరు ఇస్తాం: ఎమ్మెల్యే రాములునాయక్‌

ABN , First Publish Date - 2020-12-04T04:49:49+05:30 IST

వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో యాసంగి సాగుకు నీళ్లు విడుదల చేస్తామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ ప్రకటించారు.

యాసంగికి సాగునీరు ఇస్తాం: ఎమ్మెల్యే రాములునాయక్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా, డిసెంబరు 3: వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో యాసంగి సాగుకు నీళ్లు విడుదల చేస్తామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ ప్రకటించారు. తమ క్యాంపు కార్యాలయంలో గురువారం నీటిపారుదలశాఖ అధికారులు, రైతులు, రైతుసంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జూలైలో ప్రకటించిన విధంగానే యాసంగికి నీళ్లు విడుదల చేస్తామని రైతులు పంటలు సాగుచేసుకొనేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. నాలుగైదురోజుల్లో నీటి విడుదల షెడ్యూలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం అధ్వానంగా ఉన్న కాల్వలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులంతా తమకు, అధికారులకు సహకరించాలని సూచించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు షేక్‌.లాల్‌మహ్మద్‌, ఐబీ డీఈఈ పి.శ్రీనివాస్‌, ఏఈఈ డి.రాణి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు,  రైతుబంధు జిల్లాకమిటీ సభ్యుడు మచ్చా నర్సింహారావు, వైరా సొసైటీ మాజీ చైర్మన్‌ తాతా రంగారావు, టీఆర్‌ఎస్‌ కొణిజర్ల మండల, వైరా పట్టణ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ధార్న రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, శీలం రామకరుణాకర్‌రెడ్డి, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, తోట నాగేశ్వరరావు, పారుపల్లి కృష్ణారావు, వేమిరెడ్డి వెంకటకోటారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T04:49:49+05:30 IST