రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2020-12-11T04:43:30+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వైరా నియోజకవర్గ శాసన సభ్యులు లావుడ్యా రాములునాయక్‌ అన్నారు.

రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌

జూలూరుపాడు, డిసెంబరు 10: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వైరా నియోజకవర్గ శాసన సభ్యులు లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ పథకం క్రింద రూ. 24 లక్షలకు సంబంధించిన చెక్కులను ప్రభుత్వం మంజూరి చేసింది. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడ బిడ్డలు ఇబ్బందులు పడకూడదని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాధీముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టి ఆర్ధిక తోడ్పాటును అందిస్తుందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్ప టికి సీఎం కేసీఆర్‌ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు కుంటు పడకుండా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గత పాల కులు తెలంగాణాను భ్రష్టు పట్టించారని, కేసీఆర్‌ తెలంగాణాను ఆరేళ్లల్లో ఎంతో అభివృద్ది చేశారని కొనియాడారు. ఈ నెల 27 నుంచి ప్రతి రైతు ఖాతాలో 2వ విడత రైతు బంధు నగదును జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పీటీసీ భూక్యా కళావతి, వైస్‌ఎంపీపీ గాదె నిర్మల, ఎంపీటీసీలు పెండ్యాల రాజశేఖర్‌, బాణోత్‌ నీల, దుద్దుకూరి మధుసుధన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడెం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T04:43:30+05:30 IST