అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-11-28T04:21:50+05:30 IST

మండల పరిధిలోని జగ్గారంలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీడీవో రవీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది.

అభివృద్ధి పనుల పరిశీలన
జగ్గారంలో ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం

అశ్వాపురం నవంబరు 27: మండల పరిధిలోని జగ్గారంలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీడీవో రవీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. పంచాయతీ పరిధిలో డంపింగ్‌ యార్డ్‌, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, డ్రెయినేజి వ్యవస్థలను పరిశీలించారు. పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవో భువనేశ్వరి, పీఆర్‌ ఏఈ చారి, సర్పంచ్‌ సున్నం రాంబాబు, ఉపసర్పంచ్‌ ఆవుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఖాజాహుస్సేన్‌ పాల్గొన్నారు.

Read more