ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా గెలిపించండి

ABN , First Publish Date - 2020-10-13T06:24:42+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా గెలిపించండి

వైరా, అక్టోబరు 12: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ యువతెలంగాణ పార్టీ అభ్యర్థి గోగుల రాణీరుద్రమ్మరెడ్డి కోరారు. ఖమ్మంజిల్లా వైరా వాసవీకల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో  మాట్లాడారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని ఏనాడూ ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రగతి భవన్‌ పాలేరులాగా పనిచేశారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువతెలంగాణ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ, కార్యదర్శి కృష్ణార్జున్‌, మహిళా విభాగం నాయకురాళ్లు ఉల్లంగి పద్మ, ఉజ్వల, పగడాల కల్యాణి, లావణ్య, నాయకులు రాజరత్నం, వడ్రాణపు కిషోర్‌, అక్కిపల్లి మురళీ, వెంకటనారాయణ, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T06:24:42+05:30 IST