బైక్ పై భార్యతో కలిసి పెళ్లికి వెళ్తున్న భర్త.. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో..

ABN , First Publish Date - 2020-07-20T17:46:56+05:30 IST

ప్రమాదవ శాత్తు లారీ కిందపడి ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన ఖమ్మం రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో ఆదివారం జరిగింది.

బైక్ పై భార్యతో కలిసి పెళ్లికి వెళ్తున్న భర్త.. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో..

లారీ ప్రమాదంలో మహిళ దుర్మరణం


ఖమ్మం రూరల్‌: ప్రమాదవ శాత్తు లారీ కిందపడి ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన ఖమ్మం రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం నగరంలోని ఖానాపురానికి చెందిన మంకెన ఏకాంబ్రం, తన భార్య రమ(25) ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి బంగ్లాలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళుతున్నారు. రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌ లోకి రాగానే వెనుకనుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న రమ లారీ ముందు టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త ఏకాంబ్రం తీవ్ర గాయాలపాలయ్యారు. పారాలీగల్‌ వలంటీర్‌ అన్నం శ్రీనివాస్‌, సభ్యులు రవి, రాజేష్‌, అవినాష్‌, సురేష్‌, తదితరులు లారీటైరు కింద ఇరుక్కుపోయిన రమ మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-20T17:46:56+05:30 IST