వర్చువల్ తరగతులకు వేళాయే..
ABN , First Publish Date - 2020-09-01T06:39:57+05:30 IST
కోవిడ్-19 ప్రభావంతో విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 3వ తరగతి నుంచి 10వ

నేటినుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన
ఏర్పాట్లు పూర్తి చేసిన ఇరు జిల్లాల అధికారులు
కొత్తగూడెం కలెక్టరేట్/కల్లూరు, ఆగసు 31: కోవిడ్-19 ప్రభావంతో విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. మంగళవారం వర్చువల్ తరగతుల నిర్వహణకు నిర్ణయించగా.. ఇందుకోసం రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ)విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో విద్యను దూరదర్శన్, యాదగిరి, టీశాట్ ద్వారా రెండురకాల కృత్యపత్రాలను తయారుచేయించింది.
రొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఈ తరగతులను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇరు జిల్లాల అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. ప్రతీ పాఠశాలలో శానిటైజేషన్, ప్రతీ ఉపాఽధ్యాయుడు చేతులను శాటిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, ప్రతీ గ్రామంలో ఆన్‌లైన్ తరగతులపై అవగాహన కల్పించడం లాంటివి చేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్‌లైన్ బోధన సాగేలా ఏర్పాట్లు చేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఖమ్మం జిల్లాలో 74,042 మంది, భద్రాద్రి జిల్లాలో 69,443మంది ఉండగా.. వీరు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు విననున్నారు.