కొత్తగూడెం బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2020-06-23T10:30:01+05:30 IST

కొత్తగూ డెం ఆర్టీసీ బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం

కొత్తగూడెం బస్టాండ్‌ను  సుందరంగా తీర్చిదిద్దుతాం

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

అధికారులకు ఎమ్మెల్యే వనమా ఆదేశం


కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూన్‌ 22:  కొత్తగూ డెం ఆర్టీసీ బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం బస్టాండ్‌ నుంచి సుమారు 7వేల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారని, వారికి కావలసిన కనీస వసతులు కల్పించడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమ య్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణీకులు బస్టాండ్‌ లోకి రావాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.


రూ.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారని, దశలవారీగా బస్టాండ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, కౌన్సిలర్‌ ధర్మరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కొత్తగూ డెం ఆర్టీసీ డీవీఎం శ్రీకృష్ణ, డిపో మేనేజర్‌ శ్రీహర్ష, డీఈ భాస్కర్‌రావు, ఏఈ సురేష్‌, స్టేషన్‌ మేనేజర్‌ జమాలుద్దీన్‌, సిబ్బంది వైఎన్‌. రావు తదితరులు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులకు శంకుస్థాపన

లక్ష్మీదేవిపల్లి మండలంలో ని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని హెమచంద్రాపురం, సీతారాంపురం, ఎదురు గడ్డ గ్రామాల్లో సుమారు రూ.6కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

Read more