ఘనంగా మంగళ కౌశిక వ్రతం
ABN , First Publish Date - 2020-11-28T04:34:59+05:30 IST
దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ల అధ్వర్యంలో శుక్రవారం మంగళ కౌశిక, క్షీరాబ్ది, చిలుకు ద్వాదశి వ్రతాలను ఘనంగా నిర్వహించారు.

దుమ్ముగూడెం నవంబరు 27: దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ల అధ్వర్యంలో శుక్రవారం మంగళ కౌశిక, క్షీరాబ్ది, చిలుకు ద్వాదశి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు వెంకటేశ్వర్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీకమాసం చివరి ఏకాదశి వేకువజామున తంబురతో కౌశిక రాగంలో కీర్తనలను ఆలపిస్తూ నిద్రావస్థలో ఉన్న మహావిష్ణువును మేల్కొలపడం ఈ వ్రత విశిష్టత. కార్యక్రమంలో గ్రామస్థులు సంగీతరావు, గోపాలకృష్ణ, రాము, భిక్షం, రఘు, రవిలతోపాటు మహిళా భక్తులు పాల్గొన్నారు.