క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2020-12-28T04:30:23+05:30 IST

క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
మాట్లాడుతున్న ఏఎస్పీ వినీత్‌

భద్రాచలం ఏఎస్పీ వినీత్‌

దుమ్ముగూడెంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీల ప్రారంభం

దుమ్ముగూడెం డిసెంబరు 27: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. దుమ్ముగూడెం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కెరేగుబల్లి ఆశ్రమ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ క్రీడాపోటీల సందర్భంగా మా ట్లాడారు. యువత చదువుతోపాటు, క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరముందన్నారు. క్రీడాకారులను పరిచయం అనంతరం బాల్‌ సర్వీసు చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాపోటీలను నిర్వహిస్తున్న సీఐ వెంకటేశ్వర్లును అభినందించారు. అనంతరం సీఐ మాట్లాడతూ ఏజెన్సీలో గిరిజన యువత చదువు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. మావోయిస్టులు చెప్పే మాటలకు ఆకర్షితులు కావొద్దని సూచించారు. క్రీడల్లో ఓటములు గెలుపులు సహజమని, క్రీడాస్ఫూర్తితో వాటిని స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి బాలాజీనాయక్‌, హెచ్‌ఎం ధనసరి నాగమణి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T04:30:23+05:30 IST