వాహనంపై 31 చలాన్లు

ABN , First Publish Date - 2020-12-08T05:00:39+05:30 IST

భద్రాచలంలోని ఓ వాహనంపై 31 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా సోమవారం పట్టణ పోలీసులు వాహనాన్ని, వాహన దారుడిని స్టేషన్‌కు తరలించారు.

వాహనంపై 31 చలాన్లు
కట్టిన చలాన్లు చూపుతున్న జానకీరామ్‌

తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు

రూ.14,815 చెల్లించిన వాహనదారుడు

భద్రాచలం, డిసెంబరు 7: భద్రాచలంలోని ఓ వాహనంపై 31 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా సోమవారం పట్టణ పోలీసులు వాహనాన్ని, వాహన దారుడిని స్టేషన్‌కు తరలించారు. భద్రాచలానికి చెందిన శీలం జానకీరామ్‌ అనే వ్యక్తి టీఎ్‌స 28ఏ 6827 అనే మోటారు సైకిల్‌పై ఉన్న 31 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకీ చెల్లించకపోవడంతో పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చేసేదేం లేక జానకీరాం మీ సేవ ద్వారా రూ.14,815 చెల్లించడంతో పట్టణ సీఐ టి.స్వామి ఆ వాహనాన్ని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ స్వామి మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ వాహనాలపై ఉన్న చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించాలని తెలిపారు. ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగులో ఉంటే అట్టి వాహనాలను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలకు అనుగుణంగా యజమానులు వాహనాలు నడపాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలన్నింటినీ అందుబా టులోకి ఉంచుకుని తనిఖీల సమయంలో చూపించాలన్నారు.

Updated Date - 2020-12-08T05:00:39+05:30 IST