ప్రజా సేవలో సైనికులకు వందనం

ABN , First Publish Date - 2020-12-07T04:54:12+05:30 IST

కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో దాని నుంచి పట్టణవాసులను రక్షించేందుకు ముందుడి నడిపిం చిన సేవలనందించిన పారిశుధ్య కార్మికుల సేవలకు వందనం అంటూ వనమా వెంకటేశ్వరరావు కొనియాడారు.

ప్రజా సేవలో సైనికులకు వందనం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమా

దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం టౌన్‌, డిసెంబరు 6: కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో దాని నుంచి పట్టణవాసులను రక్షించేందుకు ముందుడి నడిపిం చిన సేవలనందించిన పారిశుధ్య కార్మికుల సేవలకు వందనం అంటూ వనమా వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆదివారం మునిసిపల్‌ కాంప్లెక్స్‌లో కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ అధ్యక్షతన పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, పట్టణ సుందరీకరణే ధ్యేయంగా అహర్నిషలు కృషి చేస్తు న్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను దరిచేర్చేందుకు కృషి చేస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ తరహాలో వేతన పెంపునకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటిఅర్‌తో చర్చిస్తానన్నారు. ప్రతినెల నిర్ణీత సమయంలో కార్మికుల జీతభత్యాలు అందేలా కృషిచేయాలని కౌన్సిలర్లను ఆదేశిం చారు. కొత్తగూడెం పురపాలకంలో మంచి చైర్‌పర్సన్‌, పాలకులు, అధికారులు ఉన్నారని... కార్మికుల సహకారంతో పట్టణ సుందరీకరణ, అభివృద్ది పనులు శరవేగంగా జరగాలన్నారు. చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ మాట్లాడుతూ.. కౌన్సిలర్ల సహకారంతో కౌన్సిల్‌  సమావేశంలో చర్చించి రెండు సంవత్సరాలుగా అందాల్సిన దుస్తులు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మార్గం సుగమమైందన్నా రు. పార్టీలకతీతంగా కార్మికుల శ్రేయస్సుకు కృషిచేస్తున్న కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. 


Read more