మణుగూరులో వకీల్‌సాబ్ చిత్రీకరణ
ABN , First Publish Date - 2020-12-11T04:54:52+05:30 IST
పవన్‌కల్యాణ్ నటిస్తున్న వకీల్‌సాబ్ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని పవన్‌కళ్యాణ్ డూప్‌తో గురువారం మణుగూరులో చిత్రకరించారు.

ఓసీ-2 గనిలో పవన్‌కల్యాణ్ డూప్‌తో షూటింగ్
మణుగూరుటౌన్, డిసెంబరు 10 : పవన్‌కల్యాణ్ నటిస్తున్న వకీల్‌సాబ్ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని పవన్‌కళ్యాణ్ డూప్‌తో గురువారం మణుగూరులో చిత్రకరించారు. రైతుల సమస్యలు, సింగరేణి కార్మికుల కష్టాల నేపథ్యంలో చిత్రం షుటింగ్ సన్నివేశాన్ని చిత్రకరించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ డూప్‌తో రేగులగండి, ఓసీ-2 గనిలో సన్నివేశాశాలను చిత్రీకరించారు. వకీల్‌సాబ్ చిత్రం షూటింగ్ చేస్తున్నారన్న సమచారంతో పవన్ చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. డూప్‌తో షూటింగ్ చేస్తున్నారని తెలియడంతో నిరాశగా వెనుదిరిగారు.