వైభవంగా రామయ్య పట్టాభిషేకం

ABN , First Publish Date - 2020-12-06T04:51:42+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణం అనంతరం పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయం.

వైభవంగా రామయ్య పట్టాభిషేకం

భద్రాచలం, డిసెంబరు 5: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణం అనంతరం పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. అందులో భాగంగా  నిత్య కల్యాణమూర్తులను నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చారు.  తొలుత స్వామివారికి కల్యాణోత్సం నిర్వహించారు. అనంతరం రామాయణంలోని పట్టాభిషేక ఘట్ట పారాయణం, పట్టాభిషేక వైభవ వివరణ, జలప్రోక్షణ, వేద ఆశీర్వచనం, మంగళహారతితో పట్టాభిషేక కార్యక్రమం పరిసమాప్తి అయ్యింది. 

16నుంచి భద్రాద్రిలో ధనుర్మాసోత్సవాలు  

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో  16నుంచి జనవరి 13వరకు ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా 16న ధనుర్మాసం ప్రారంభం, 18న శ్రీ రాజా తూము నరసింహదాసు జయంతి వేడుకలు, 24న తిరుమంగై ఆళ్వారు పరమ పదోత్సవం నిర్వహించనున్నారు. 25న శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం, 31న శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ, జనవరి 9న లక్ష కుంకుమార్చన, 10న విశ్వరూప సేవ, 11న కూడారై ఉత్సవం నిర్వహించనున్నారు. 

 

Updated Date - 2020-12-06T04:51:42+05:30 IST