వివాహాలకు హాజరైన తుమ్మల
ABN , First Publish Date - 2020-12-11T04:41:32+05:30 IST
ఇల్లెందు పట్టణం, మం డలంలో గురువారం జరిగిన ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల కుమారుల వివాహలకు గురువారం రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరయ్యారు.

ఇల్లెందుటౌన్, డిసెంబరు 10: ఇల్లెందు పట్టణం, మం డలంలో గురువారం జరిగిన ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల కుమారుల వివాహలకు గురువారం రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరయ్యారు. ఇల్లెందు పట్టణంలోని 3వవార్డు బస్టాండ్ సమీపంలో గల ప్రభునాధ్ యాదవ్ కుమారుడి వివాహంతోపాటు మండల పరిధిలోని ధర్మారం తండా గ్రామానికి చెందిన దేవీలాల్ నాయక్ కుమారుడి వివాహనికి హజరైన తు మ్మల నాగేశ్వర్‌రావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, ఇల్లెం దు ఎమ్మెల్యే హరిప్రియ నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు కనగాల పేరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ దిండి గాల రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.