ఇక రయ్‌..రయ్‌..అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-11-03T10:04:40+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. సోమవారం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎంవోయూ పై తెలంగాణ రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఎండీ

ఇక రయ్‌..రయ్‌..అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ

రీజియన్‌లో  రోడ్డెక్కిన 100 బస్సులు

50వేల కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం


ఖమ్మం సాంస్కృతికం నవంబరు2: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. సోమవారం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎంవోయూ పై తెలంగాణ రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, ఎపీఎస్‌ఆర్టీసీ ఎండి.కృష్ణబాబు సంతకాలు చేశారు. లాక్‌డౌన్‌ నుంచి సుమారు ఏడు నెలల కాలంగా అంతరాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర బస్‌ సర్వీసుల పునరుద్ధరణతో ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతం కలగనుంది. 

 

సోమవారం రాత్రి నుంచే..

ఖమ్మం రీజియన్‌లోని ఆరు బస్‌ డిపోల నుంచి అంతరాష్ట్ర బస్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొత్తం 100 సర్వీసుల ద్వారా రోజుకు 50 వేల కిలోమీటర్లు బస్సులు నడువనున్నాయి. ఖమ్మ నుంచి విశాఖపట్నానికి, మధిర నుంచి విజయవాడకు, సర్వీసు లు ప్రారంభమయ్యాయు. కొత్తగూడెం నుంచి విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు, మణుగూరు , భద్రాచలం సత్తుపల్లినుంచి విజయవాడ, విశాఖ, పార్వతీపురం, రాజమండ్రికి బస్‌సర్వీసుల నడపనున్నారు. ప్రయాణికుల రద్దీనిబట్టి బస్సుల్ని నడుపుతామని ఆర్‌ఎం  క్రిష్ణమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2020-11-03T10:04:40+05:30 IST