పులి కోసం ముమ్మర గాలింపు
ABN , First Publish Date - 2020-12-08T05:05:29+05:30 IST
పది రోజులుగా బూర్గంపాడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పులులు సంచరిస్తుండడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు.

ఆందోళనలో ప్రజలు .. గ్రామ కమిటీల ఏర్పాటు
బూర్గంపాడు, డిసెంబరు 7: పది రోజులుగా బూర్గంపాడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పులులు సంచరిస్తుండడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు. గత నెల 26న రాత్రి సమయంలో సారపాక పుష్కరవనం వైపు నుంచి నాగినేనిప్రోలు వైపునకు పులి వెళ్లినట్లు ఆదికారులు గుర్తించారు. రెండు రోజుల ఆనంతరం కృష్ణసాగర్ సమీపంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాల్వ కట్ట వైపు నుంచి అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు వైపునకు వెళ్లినట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఆందించారు. దీంతో ఆదికారు లు అక్కడికి చేరుకుని ఆడుగులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి సమయంలో మణుగూరు క్రాస్ రోడ్డు నుంచి కృష్ణాసాగర్‌కు వెళ్లే క్రాస్‌రోడ్డుకు మధ్యలో పులి రోడ్డు దాటడాన్ని గమనించిన ఓ లారీ డ్రైవర్ అధికారులకు సమాచారం అం దించారు. అప్రమత్తమైన అధికారులు గాలింపు చేపట్టారు. సోమవారం ఎఫ్‌డీవో వే ణుబాబు, ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందితో కలిసి కృ ష్ణాసాగర్ ఆటవీ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేసి రోడ్డు దాటిందని భావించిన సమీపంలోని ఓ పత్తి చేనులో అధికారులు పులి అడుగులను గుర్తించారు. సాయం త్రం వరకు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన అధికారులు పులి జాడ లభ్యం కాలేదు.
ఆందోళనలో స్థానికులు
పులి సంచరిస్తుందనే సమాచారంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. కృ ష్ణా సాగర్‌తో పాటు సమీప గ్రామాలైన చెరువు సింగారం, ఎస్‌టీకాలనీ, బత్తులనగర్, ఉర్లదోసపల్లి, ముసలిమడుగు, లక్ష్మీపురం ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అటవీ ప్రాంతం వైపునకు వెళ్లకుండా సాఽ్ధనికులకు ఆవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి స్థానికులకు ఆవగాహన కల్పిస్తున్నారు. పశువుల కాపరులు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు అడవిలో ఇష్టానుసారంగా తిరగవద్దని హెచ్చరించారు.
ఆప్రమత్తంగా ఉండాలి ఎఫ్‌ఆర్‌వో ప్రసాదరావు
స్థానిక గ్రామాల ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో బయట తిరగరాదు. పులి జాడలు గుర్తిస్తే అధికారులకు సమాచారం ఆందించాలి.