మావోయిస్టు దళ సభ్యుడి లొంగుబాటు

ABN , First Publish Date - 2020-03-18T12:08:07+05:30 IST

మావోయిస్టు దళ సభ్యుడు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్‌పీ ఎదుట లొంగిపోయాడు.

మావోయిస్టు దళ సభ్యుడి లొంగుబాటు

పాల్వంచ రూరల్‌, మార్చి 17: మావోయిస్టు దళ సభ్యుడు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్‌పీ ఎదుట లొంగిపోయాడు. పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో ఓఎస్‌డీ రమణారెడ్డి లొంగిపోయిన మావోయిస్టు దళసభ్యుడి వివరాలను మీడియాకు వెళ్లడించారు. మావోయిస్టు పార్టీ దళసభ్యుడైన మడివి దేవ అలియాస్‌ రవి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నాడు.


2014లో పామేడు ఏరియా కమాండర్‌ మడకమ్‌ లక్మల్‌ ఆధ్వర్యంలో బాలబాలికల సంఘంలో దేవ సభ్యుడిగా చేరాడు. 2015లో ఎల్‌ఓఎస్‌లో దళసభ్యుడిగా చేరాడు. అప్పటినుంచి పలు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. అటు పిమ్మట ఇడుమ బెటాలియన్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమకు గార్డ్‌ ప్రొటెక్షన్‌ టీమ్‌లో పనిచేశాడు. జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశఽంతో పార్టీ కార్యకలాపాలకు స్వస్తిచెప్పి పాల్యంచలోని తన సన్నిహితుల ద్వారా కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.


మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారు స్వయంగా పోలీసులకు లొంగిపోతే వారిపైన గతంలో ఉన్న కేసులను పరిగణలోకి తీసుకోకుండా వారికి పునరావాసం కల్పించడానికి తెలంగాణ పోలీసు శాఖ బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతుందని ఓఎస్‌డీ తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్‌పీ ప్రసాద్‌రావు, సీఐ నవీన్‌, టౌన్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T12:08:07+05:30 IST