ఉద్యోగానికి ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల రాజీనామా

ABN , First Publish Date - 2020-03-04T12:09:01+05:30 IST

ఇద్దరు జూనియర్‌ పం చాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎంపీడీవో శ్రీనివాస రావు

ఉద్యోగానికి ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల రాజీనామా

ముదిగొండ, మార్చి 3: ఇద్దరు జూనియర్‌ పం చాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎంపీడీవో శ్రీనివాస రావు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మండలంలోని పండ్రేగుపల్లి, ముత్తారం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న మహేష్‌, తేజస్విని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. మహేష్‌ పోస్టల్‌ శాఖలో ఉద్యోగం రావడం వల్ల, తేజస్విని వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేసిన ట్లు ఎంపీడీవో తెలిపారు. వారిద్దరి రాజీనామాలను ఆమోదించి కలెక్టర్‌, పంచాయతీ విభాగానికి పంపినట్లు వెల్లడించారు. 

Updated Date - 2020-03-04T12:09:01+05:30 IST