నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-04-07T10:08:57+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేయాలని పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ పోలీసు అదికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలో

నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి

సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ 


ఖమ్మంక్రైం, ఏప్రిల్‌6: జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేయాలని పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ పోలీసు అదికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలో పలుప్రాంతాలలోని పోలీసు చెక్‌పోస్టులను రద్దీని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యాన్ని విస్మరించి ప్రజలు నిత్యావసర దుకాణాలలో కూరగాయల మార్కెట్లలో రేషన్‌ బియ్యం పంపిణీలో భౌతికదూరం పాటించడంలేదని, అవసరం లేకున్నా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆయన సూచించారు.


ముఖ్యంగా కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో పెటుటకుని పోలీసుశాఖ సిబ్బంది అధికారులుఅప్రమత్తం కావాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఇకపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. సీపీ వెంట ఏడీసీపీ మురళీధర్‌, ఏసీపీ రామోజీరమేష్‌, ప్రసన్నకుమార్‌, టుటౌన్‌ సీఐ తుమ్మా గోపి, త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌, వన్‌టౌన్‌ సీఐ రమే్‌షలున్నారు.

Updated Date - 2020-04-07T10:08:57+05:30 IST