ముదిరిన రామనారాయణ వివాదం?

ABN , First Publish Date - 2020-07-08T10:18:50+05:30 IST

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో రామనా రాయణ వివాదం మరింతగా ముదురుతోంది.

ముదిరిన రామనారాయణ వివాదం?

 సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలంతో 

దూషించారంటూ ఆరోపణలు

 న్యాయవాది ద్వారా నలుగురికి నోటీసులు జారీ చేసిన

 ఆధ్యాత్మికవేత్త చిదంబరశాస్త్రి

 సామాజిక మాద్యమాల్లో నోటీసుల విస్తృత ప్రచారం


భద్రాచలం, జూలై 7: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో రామనా రాయణ వివాదం మరింతగా ముదురుతోంది. భద్రాద్రి రామయ్యకు నిర్వ హించే కల్యాణంలో గోత్రప్రవరలను మార్చారని  కొంతకాలంగా వస్తున్న వి మర్శల నేపథ్యంలో సామాజిక మాద్యమాల్లో చోటు చేసుకున్న సంభాషణ లు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో భద్రాచలం దేవస్థా నంలో పనిచేసే ఇరువురు వైదిక సిబ్బందితో పాటు విశ్రాంత వైదిక సిబ్బంది ఇరువురికి న్యాయవాది ద్వార ఏపీలోని చీరాలకు చెందిన ఆధ్యాత్మికవేత్త చిదంబరశాస్త్రి నోటీసులు జారీ చేసినట్లు సామాజిక మాద్యమాల్లో ప్రచారం సాగుతోంది. సామాజిక మాద్యమాల్లో జరిగిన సంభాషణల్లో తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఆ నోటీసులో ఆరోపించినట్లు తెలుస్తోం ది. అలాగే సీతారామ అర్చక సంఘం పేరుతో రాసిన లేఖలో వ్యక్తిగత దూషణలు చేసి తనకు అపకీర్తి తెచ్చారని ఆయన ఆరోపించినట్లు సమాచా రం.


ఈ నేపఽథ్యంలో ఈ విషయాలపై చట్టపరమైన చర్యలను తీసుకుంటా మని ఆ నోటీసులో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటీసులు మంగళవారం సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. కాగా ఈ నోటీసులు ఇప్పటికే సంబందిత వైదిక సిబ్బందికి అందినట్లు వైదిక వర్గాల ద్వార తెలుస్తుండగా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించడం లేదు. ఇదిలా ఉండగా భద్రాద్రి క్షేత్రంపై ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల క్షేత్రానికి అపఖ్యాతి కలుగుతోందని పలువురు భద్రాద్రివాసులు వాపోతున్నారు. దేవస్థానం అధికారుల పర్యవేక్షణ కొరవడటం వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లు భద్రాద్రివాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి దేవస్థానం ఈవో ఈ విషయాలపై దృష్టిసారించి భద్రాద్రి ఖ్యాతి ఇనుమడించే  విధంగా చూడాలని వారు అభ్యర్ధిస్తున్నారు. 

Updated Date - 2020-07-08T10:18:50+05:30 IST