పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-11-20T09:30:41+05:30 IST
పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వేంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు ఆందోళన
ఖమ్మం మయూరిసెంటర్ ,నవంబరు 19: పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వేంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు ఆందోళన అనంతరం డిపివో కార్యలయం వద్ద గురువారం జరిగిన సమావేశంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు విధినిర్వహణలో తివ్ర ఇబ్బందులు పడుతున్నారని పని భారం అదికంగా ఉండటంతో మానసిక వత్తిడికి గురౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు కార్యదర్శులు ఎంతో కృషి చేస్తున్నారని అటువంటి కార్యదర్శుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చేందిందన్నారు. వారిపై పని భారం తగ్గించి వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు వేంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండపర్తి గొవిందరావు, తోట రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శుల నాయకులు కె శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ భూక్య సైదులు, వినోద్‌కుమార్, కిరణ్, నిరోష, సాయి, తదితరులు ఉన్నారు.