మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-02-12T06:14:05+05:30 IST

మతిస్థిమితం లేకుండా సంచరిస్తున్న ఓ వ్యక్తిని మధిర టౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని ఖమ్మం అన్నం పౌండేషన్‌కు అప్పగించారు. మతిస్థిమితం లేని ఓ అజ్ఞాత వ్యక్తి

మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మధిర టౌన్‌, ఫిబ్రవరి 11: మతిస్థిమితం లేకుండా సంచరిస్తున్న ఓ వ్యక్తిని మధిర టౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని ఖమ్మం అన్నం పౌండేషన్‌కు అప్పగించారు. మతిస్థిమితం లేని ఓ అజ్ఞాత వ్యక్తి గత ఐదురోజులుగా మధిరలో సంచరిస్తూ వాహనాల అద్దాలు, కిటికీఅద్దాలు పగులగొట్టేందుకు యత్నిస్తున్నాడు. ఇతని చర్యలకు భయబ్రాంతులైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ, ఎస్‌ఐలు స్పందించి పోలీసులను పంపించి ఆవ్యక్తిని అదుపులోకి తీసుకొని అన్నం పౌండేషన్‌కు అప్పగించారు. కార్యక్రమంలో అన్నం పౌండేషన్‌ సభ్యులు దోర్నాల రామకృష్ణ, నిస్సి హరిణి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T06:14:05+05:30 IST