చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-03-08T11:59:28+05:30 IST
మద్యం మత్తులో పురుగలమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా

జూలూరుపాడు, మార్చి 7: మద్యం మత్తులో పురుగలమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు(33) కొంతకాలంగా మద్యానికి బానిస కావటంతో ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం మద్యం మత్తులో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడి భార్య జీవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.