కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-08T11:57:03+05:30 IST

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

లక్ష్మీదేవిపల్లి, మార్చి 7: కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగళ్లకు చెందిన ధరావత్‌ కిషన్‌ (50)కు ఇద్దరు భార్యలు మొదటి భార్య చనిపోతే అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తున్న మరో మహిళను వివాహం చేసుకున్నాడు.


కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం భార్య భర్తల మధ్య గొడవ జరిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కిషన్‌ గట్టుమళ్ల ప్రాంతాల మధ్యలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న షెడ్డులో ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-08T11:57:03+05:30 IST