వచ్చే రెండు వారాలు కీలకం

ABN , First Publish Date - 2020-04-14T11:26:47+05:30 IST

‘లాక్‌డౌన్‌ పొడిగింపుతో రాబోయే రెండు వారాలు అత్యంత క్లిష్టమైనవి. సమీప జిలాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి

వచ్చే రెండు వారాలు కీలకం

భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

పలుచోట్ల సరిహద్దు చెక్‌పోస్టుల తనిఖీ


ఆంధ్రజ్యోతి కొత్తగూడెం/ కొత్తగూడెం కలెక్టరేట్‌/సుజాతనగర్‌/జూలూరుపాడు, ఏప్రిల్‌ 13: ‘లాక్‌డౌన్‌ పొడిగింపుతో రాబోయే రెండు వారాలు అత్యంత క్లిష్టమైనవి. సమీప జిలాలు, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని, వ్యక్తిని నిశితంగా పరిశీలించాలని’ భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. చుంచుపల్ల్లి చెక్‌ పోస్టును సోమవారం ఆయ న ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కార్లు, బైక్‌లపై జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. 


జూలూరుపాడు మండలంలోని సరిహద్దుగా గ్రామం వినోభానగర్‌ను సందర్శించిన కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వాహనాలను, ప్రజలను జిల్లాలోకి అనుమతిం చవద్దన్నారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలలో కోవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపుతుండడంతో జిల్లాను దిగ్భంధనం చేశామన్నారు.  కలెక్టర్‌ వెంట ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దార్‌ కొర్ల విజ య్‌కుమార్‌, ఎంపీడీవో దేవకరుణ, ఎంపీవో పుల్లూరి జగదీశ్వరరావు, ఎస్‌ఐ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు గ్రామాల్లోనే చేపట్టాలి

రైతుల సౌలభ్యం కోసం వరి, మొక్కజొన్న కొనుగోళ్లను గ్రామాల్లోనే చేపట్టాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సుజాతనగర్‌ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సహాయం చేసేలా కొనుగోలు కేంద్రాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో స్వర్ణలత, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కృపాకర్‌ రావు, తహశీల్దార్‌ నాగరాజు, ఆర్‌ఐ నాగమణి, ఎండీవో ఖాన్‌, ఎంవో డాక్టర్‌ నాగమణి, ఏపీఎం మీరాబీ, కో-ఆపరేటివ్‌ ఛైర్మన్‌ మండే వీర హనుమం తరావు, సీఈవో చింతాల రాంబాబు, ఏఈవో శరత్‌, సైదులు పాల్గొన్నారు.


ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజలు మన జిల్లాలోకి ప్రవేశించకుండా గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పటిష్ఠ బందోబస్తు కొనసాగాలని కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో మునిసిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని చెక్‌ పోస్టులు వద్ద నిశిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సునిల్‌ దత్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ కే. వెంకటేశ్వర్లు, ట్రైనీ ఐఏఎస్‌ అనుదీప్‌, కొత్తగూడెం, ఇల్లెందు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లు సీతాలక్ష్మీ, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-14T11:26:47+05:30 IST