నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-02-08T08:34:08+05:30 IST

జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదే శాల మేరకు ఈ ఏడాది మొదటి జాతీయ లోక్‌అదాలత్‌ నేడు నిర్వహిం చనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

ఖమ్మంలీగల్‌, ఫిబ్రవరి 7: జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదే శాల మేరకు ఈ ఏడాది మొదటి జాతీయ లోక్‌అదాలత్‌ నేడు నిర్వహిం చనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు.


న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఖమ్మంలో లోక్‌అదాలత్‌ బెంచీలను ఏర్పాటు చేస్తూ సంస్థ న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మంలో మోటారు వాహన కేసులు 8వ అదనపు జిల్లా జడ్జి పి.చంద్రశేఖరప్రసాద్‌ పరిష్కరించనున్నారు. బ్యాంకు కేసులు ఇతర సివిల్‌ కేసులు న్యాయసేవా సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్‌, ప్రధాన జూని యర్‌ సివిల్‌కోర్టు, మొదటి, రెండవ అదనపు మెజిస్ర్టేట్‌ కోర్టుల కేసులను న్యాయమూర్తి ఎన్‌.అనితారెడ్డి, మొబైల్‌ ఎక్సైజ్‌, మూడవ అదనపు మెజిస్ర్టేట్‌ కోర్టు కేసులను న్యాయమూర్తి ఎం.ఉషశ్రీలు పరిష్కరించనున్నారు. బార్‌ అధ్యక్షుడు జి.తాజుద్దీన్‌ బాబా ఆధ్వర్యంలో న్యాయవాదులు లోక్‌అదాలత్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు.

Updated Date - 2020-02-08T08:34:08+05:30 IST