రైతులకు రెట్టింపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-04-15T06:32:51+05:30 IST

రైతులకు రెట్టింపు ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ధ్యే యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రైతులకు రెట్టింపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం

రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌

మిరప రైతులకు రుణాల పంపిణీ


ఖమ్మం మార్కెట్‌, ఏప్రిల్‌ 14: రైతులకు రెట్టింపు ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ధ్యే యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కోన్నారు. మంగళవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కోల్డ్‌ స్టోరేజీలలో మిర్చి పంటను నిల్వ చేసుకున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధి రైతులకు ఆరు నెలల వడ్డీ లేని రైతు బంధు రుణాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు ధరలు లేనపుడు నిల్వ చేసుకొనే అవకశం కల్పిస్తూనే, వడ్డీ లేని రుణాలను ఇవ్వడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభ పడతారన్నారు.


ఖమ్మం మార్కెట్‌కు రూ. 5 కోట్లు, మద్దులపల్లి, మధిర, నేలకొండపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్‌లకు రూ. 18 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. దళారీ వ్యవస్థను రూపు మాపి రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు అనంతరం రఘునాధపాలెం మండలానికి చెందిన సుమారు 10 మంది రైతులకు రైతుబంధు పధకం కింద చెక్కులను అందించారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, మా ర్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ ఛైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి రత్నం సంతో్‌షకుమార్‌, మార్కెట్‌ ఉన్నత శ్రేణి సెక్రెటరీ పి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, సెక్రెటరీ గుడవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-15T06:32:51+05:30 IST