ప్రతీగింజను కొంటాం

ABN , First Publish Date - 2020-05-09T10:26:42+05:30 IST

రైతులు పండించిన ప్రతీగింజను కొంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రతీగింజను కొంటాం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


కొణిజర్ల/ఖమ్మం కార్పొరేషన్‌ మే 8: రైతులు పండించిన ప్రతీగింజను కొంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన వివరించారు. శుక్రవారం ఆయన కొణిజర్ల మండలం తనికెళ్ల, సింగరాయపాలెంలో కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.


సంచుల కొరత, లారీల కొరత, ఎగుమతులుపై అధికారులతో మాట్లాడారు. అనంతరం సింగరాయపాలెం నర్సరీని పరిశీలించారు.  కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే రాములునాయక్‌, సర్పంచ్‌ చల్లా మోహన్‌రావు, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ, జడ్పీటీసీ పోట్ల కవిత, సొసైటీ చైర్మన్‌ చెరుకుమల్లి రవి, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీడీవో రమాదేవి, జేసీ మదన్‌మోహన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వైరా మార్కెట్‌కమిటి చైర్మన్‌ గుమ్మా రోశయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కోసూరి శ్రీను, సింగరాయపాలెం సర్పంచ్‌ దొడ్డపునేని జ్యోతి, ఏలూరు శ్రీనివాసరావు, బండారు కృష్ణ, రాయల పుల్లయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T10:26:42+05:30 IST