వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-03-18T12:06:43+05:30 IST

ఢీవైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఖమ్మం త్రీటౌన్‌ ప్రాం తంలో జరిగింది. తూర్పుగోదావరి జి ల్లా

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి

 ముగ్గురికి గాయాలు


ఖమ్మంక్రైం, మార్చి17: ఢీవైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఖమ్మం త్రీటౌన్‌ ప్రాం తంలో జరిగింది. తూర్పుగోదావరి జి ల్లా అనపర్తికి చెందిన గుబ్బల బ్రహ్మం (29) స్టీల్‌ సామన్లు అమ్ముకుంటూ ఖమ్మంలో నివసిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని జహీర్‌పుర రోడ్డులో ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ ఎదురుగా రావడంతో దానిని తప్పించబోయి ఢీవైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో బ్రహ్మం అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కొణిజర్ల: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన మండల పరిధిలోని పల్లిపాడు సమీపంలో మంగళవారం జరిగింది. కొణిజర్లకు చెందిన కొమ్మినేని వీరయ్య, లక్ష్మీ దంపతులు ద్విచక్రవాహనంపై వైరా వెళ్తుండగా పల్లిపాడు సమీపంలో వైరా వైపు వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు ఇద్దరు గాయపడ్డారు. కాగా అటుగా వెళ్తున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. అంతేకాకుండా క్షతగాత్రులను ఆటో ఆపి ఖమ్మం ఆసుపత్రికి పంపించారు. ఎస్‌ఐ మొగిలి అక్కడకు చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా రాములునాయక్‌ క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించాలనే తపనను చూసి స్థానికులు ఎమ్మెల్యే అని చూసుకోకుండా ఎంతో బాధ్యతగా తన పని చేశాడని కొనియాడారు. 


బూర్గంపాడు: కారు ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. మండల పరిధిలోని ఆంజనాపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వర్లు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. క్షతగాత్రుడి కుమారుడు ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు పేర్కొన్నారు.


Updated Date - 2020-03-18T12:06:43+05:30 IST