కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-08-20T10:34:52+05:30 IST

జాతీయ విపత్తు సహాయనిధి నిబంధనలను అనుసరించి కరోనాతో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆర్థికసహాయం ప్రకటించాలని సీపీఎం

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ఎర్రుపాలెం, ఆగస్టు 19: జాతీయ విపత్తు సహాయనిధి నిబంధనలను అనుసరించి కరోనాతో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆర్థికసహాయం ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామశాఖల ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 26వతేదీవరకు వారంరోజులపాటు తలపెట్టిన నిరసన వారాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గొల్లపూడి కోటేశ్వరరావు, సగ్గుర్తి సంజీవరావు, నల్లమోతు హన్మంతరావు, నాగులవంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Read more