సహకార పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఇవే
ABN , First Publish Date - 2020-02-08T09:41:39+05:30 IST
జిల్లాలో ఈనెల 15న జరిగే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి కేంద్రాలను ఏర్పాటు

అశ్వారావుపేట రూరల్/ ఖమ్మం వ్యవసాయం ఫిబ్రవరి 7: జిల్లాలో ఈనెల 15న జరిగే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెండు మూడు సహకార సం ఘాలకు సంబంధించి న సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లకు ఎన్నిక జరగనుంది. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రి జిల్లా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈనెల 14న తేదీన ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించనున్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా సంఘాలకు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు..
ఆరు చోట్ల సామగ్రి పంపిణీ
ఉమ్మడి జిల్లాలో 97 సహకార సంఘాలున్నాయి. వీటికి ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకాగా శనివారంతో నామినేషన్ల స్వీకరణకు తెరపడనుంది. ఎన్నికలకు సం బంధించి భద్రాద్రి జిల్లాలో ఆరు చోట్ల సా మగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట ఉన్నత పాఠశాలలో అశ్వారావుపేట, నారాయణపురం, దమ్మపేట సహకార సంఘాలకు, పాల్వంచలోని బొల్లోరిగూడెం ఉన్నత పాఠశాలలో బూర్గంపాడు, ములకలపల్లి, పాల్వంచ సహకార సంఘాలకు, కొత్తగూడెంలోని చుంచుపల్లి ఉన్నత పాఠశాలలో కొత్తగూడెం, జూలూరుపాడు, గానుగపాడు, గుంపెన సొసైటీలకు, మణుగూరులోని సమి తి సింగారం ఉన్నత పాఠశాలలో మణుగూ రు, నెల్లిపాక, అశ్వాపురం, పినపాక సొసైటీలకు, భద్రాచలంలోని నన్నెపునేని మోహన్ ఉన్నత పాఠశాలలో భద్రాచలం, సత్యనారాయణపురం, చర్ల, దుమ్ముగూడెం సహకార సంఘాలకు, ఇల్లందులోని జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఇల్లెందు, గుండాల, బేతంపుడి సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తారు.
ఖమ్మం జిల్లాలో 76 సంఘాలు ఉన్నా యి. 1,56,512 మంది ఓటర్లు తమ ఓటు హ క్కు వినియోగించుకొనున్నారు. వీటికి మొ త్తం 1731 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం అవుతాయని సహకార శాఖ అంచనాలు వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి శుక్రవారం ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించింది.