రాజ్యాంగమే మానిఫెస్టో

ABN , First Publish Date - 2020-03-08T12:05:07+05:30 IST

తమ మానిఫెస్టో భారత రాజ్యాంగమనీ, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సకలజనుల సమితి వ్యవస్థాపక

రాజ్యాంగమే మానిఫెస్టో

నేడు సకలజనులసమితి కార్యాలయం ప్రారంభం

విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపినాథ్‌


(ఆంధ్రజ్యోతి- ఖమ్మం): తమ మానిఫెస్టో భారత రాజ్యాంగమనీ, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సకలజనుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపినాథ్‌ అన్నారు. శనివారం తమ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా సకలజనుల సమితి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు  తెలిపారు. చట్టంలో అందరూ సమానమే అనే మాటకు కట్టుబడి సకలజనుల సమితిని సామాజిక, సాంస్కృతిక సంస్థగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.


సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని రాజ్యాంగంలో చెప్పిన విధంగా ఆచరణ రూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలను ప్రజలకు చేర్చడంలో భాగస్వాములమవుతామన్నారు. ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ పథకాలను పందికొక్కుల్లా తినేవారిని నిలదీస్తామన్నారు. ఏ ప్రభుత్వంలో అయినా పథకాలు రచించడంలో లోపాలుండవని, దానిని ఆచరించడంలోనే లోపాలున్నాయన్నారు. ప్రజాప్రతినిధుల్లో ఎంతమందికి రాజ్యాంగపఠీకలు తెలుసునని ఆయన ప్రశ్నించారు.


దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం ఐదు కుటుంబాల చేతిలో ఉండటం దురదృష్టకరమన్నారు. భారతదేశ ప్రజలకు రాజ్యాంగమే పవిత్రగ్రంథమని దానికి ఎలాంటి మకిల అంటకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సకలజనుల సమితి సెక్రటరీ లిక్కి కృష్ణారావు యాదవ్‌, కోశాధికారి జి. ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు సి.హెచ్‌. కనకయ్య, క్రీయాశీలక సభ్యులు ఎస్‌. కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T12:05:07+05:30 IST