మద్యం మత్తులో ఆటో దహనం

ABN , First Publish Date - 2020-03-19T12:06:23+05:30 IST

పట్టణంలో మత్తులో జోగుతున్న యువకులు మరో సంఘటనకు ఒడిగట్టారు.

మద్యం మత్తులో ఆటో దహనం

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, మార్చి 18: పట్టణంలో మత్తులో జోగుతున్న యువకులు మరో సంఘటనకు ఒడిగట్టారు. బుధవారం తెల్లవారు జామున ఇంటి ముందు పెట్టిన ఆటోను దహనం చేశారు. ఈ సంఘటన కొత్తగూడెం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. త్రీ టౌన్‌ ఎస్‌ఐ శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులోగల కూలీలైన్‌ ఏరియాలో అతిగా మద్యం సేవించి కొంతమంది యువకులు తెల్లవారు జామున బీభత్సం సృష్టించారు. స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఆ ప్రాంతంలో పార్కింగ్‌చేసి ఉన్న ప్యాసింజర్‌ ఆటోను దహనం చేశారు. మంటలు ఎగసి పడటంతో గమనించిన స్థానికులు నీళ్లు చల్లి ఆర్పేశారు. అటో యజమాని పప్పు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-03-19T12:06:23+05:30 IST