కరోనాపై అవగాహనకు బృందాలు
ABN , First Publish Date - 2020-03-27T11:49:39+05:30 IST
కరోనాపై ప్రజలకు అవగాహన పెంచేం దుకు మండలంలో యాంటీ కరోనా టీంలు ఏర్పాటు చేసినట్టు వైస్ ఎంపీపీ గుత్తా
రఘునాథపాలెం మార్చి 26: కరోనాపై ప్రజలకు అవగాహన పెంచేం దుకు మండలంలో యాంటీ కరోనా టీంలు ఏర్పాటు చేసినట్టు వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్ తెలిపారు. గురువారం ఏడుగురు సభ్యులతో మండ లంలోని చిమ్మపుడిలో యాంటీ కరోనా టీంను ఏర్పాటు చేశారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ సూచనల మేరకు సర్పం చ్, ఉ పసర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శి, గ్రామ పోలీస్ అధికారి, వీఆర్వో, ఏఎన్‌ఎంలతో కమిటీని ఏర్పాటు చేవామన్నారు.
కమిటీ సభ్యులు నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లే వారికి సూచనలు చేస్తారన్నారు. రోడ్లమీద గుంపు లుగా ఉండకుండా పర్యవేక్షిస్తారన్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా చూస్తారన్నారు. పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియం త్రణలో ఉంచుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గొర్రె కృష్ణవేణి, ఉ పసర్పంచ్ గుత్తా వెంకటేశ్వర్లు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీనివాసరావు, కాళంగి వీరబాబు పాల్గొన్నారు.