నిట్‌ విద్యార్థిని మృతికి కారకుడైన ఉపాధ్యాయుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-06-21T10:14:31+05:30 IST

అజయ్‌తండాలోని ఈనెల 18న స్వగృహంలో నిట్‌ జంషెడ్‌పూర్‌ విద్యార్థిని తేజావత్‌ సంధ్య(19) ఆత్మహత్యకు కారకుడిగా భావిస్తూ

నిట్‌ విద్యార్థిని మృతికి కారకుడైన ఉపాధ్యాయుడి అరెస్టు

నేలకొండపల్లి, జూన్‌ 20: అజయ్‌తండాలోని ఈనెల 18న స్వగృహంలో నిట్‌ జంషెడ్‌పూర్‌ విద్యార్థిని తేజావత్‌ సంధ్య(19) ఆత్మహత్యకు కారకుడిగా భావిస్తూ ఖమ్మం శాంతినగర్‌కు చెందిన కోటపర్తి శ్రీకాంత్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ అశోక్‌రెడ్డి వివరాలను తెలిపారు. మృతురాలి సెల్‌ ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.


సంధ్య 10వ తరగతి చదివే సమయంలో శ్రీకాంత్‌  పరిచయం పెంచుకున్నాడన్నారు. 2018 డిసెంబరు నుంచి శ్రీకాంత్‌ మృతురాలితో వాట్సప్‌లో చాటింగ్‌ చేస్తూ ప్రేమిస్తున్నట్లు చెప్పాడన్నారు. అనంతరం వేదింపులు ప్రారంభించాడని, అవి తట్టుకోలేక మనస్తాపానికి గురైన సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కాగా ఆమె మృతిని నిర్దారించుకునేందుకు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లిన శ్రీకాంత్‌, కేసు విషయం తెలుసుకునేందుకు నేలకొండపల్లి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌ నిమిత్తం ఖమ్మం కోర్టుకు తరలించారు.

Updated Date - 2020-06-21T10:14:31+05:30 IST