వ్యవసాయ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న మోదీ
ABN , First Publish Date - 2020-12-12T04:37:07+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవసాయ రంగంలో మూడు కొత్త చట్టా లను తీసుకొని వచ్చి వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
పార్టీ ఎదుగుదలకు కార్యకర్తలు కృషిచేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
జూలూరుపాడు, డిసెంబరు 11: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవసాయ రంగంలో మూడు కొత్త చట్టా లను తీసుకొని వచ్చి వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కాకర్ల గ్రామంలో సీపీఎం మండల విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నాయకులు రాచబంటి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కలుగుతున్న నష్టాన్ని గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవ సాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులను ఐక్యం చేసి పోరాటాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. గత 15 రోజులుగా కోటి మంది రైతులు ఢిల్లీ నడి బొడ్డున వ్యవ సాయ రంగంలో తీసుకొచ్చిన మూడు చట్టాలనురద్దు చే యాలని పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా వ్యవహరించడం శోచణీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోధీ చట్టాలను రద్దు చేయకుంటే తెలంగాణా రాష్ట్రంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రేరేపించి లబ్ది పొం దాలని చూస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన దుబ్బా క అసెంబ్లీ, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో ఆ పార్టీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొం దారని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం ఆ పార్టీ నా యకులకు సరికాదని అన్నారు. తెలంగాణాలో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో మతోన్మాదం పెరిగే అవకాశం ఉందని, దీనిని ప్రజలు గమనించి ఆ పార్టీకి బుద్ది చెప్పాలని కోరారు. గ్రా మ స్థాయి నుంచి పార్టీ ఎదుగుదలకు నాయకులకు, కా ర్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని అయి లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, గుగు లోత్ ధర్మా, పార్టీ మండల కార్యదర్శి చీమలపాటి బిక్షం, రైతు సంఘం జిల్లా ఉపధ్యక్షుడు బాణోత్ ధర్మా, నాయ కు లు గార్లపాటి వెంకటి, వెంకటేశ్వర్లు, సుగుణ, మధు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాల వారు సీపీఎంలో చేరారు.