ప్రవాసీయుల కోసం నగరంలో సర్వే

ABN , First Publish Date - 2020-03-28T11:37:46+05:30 IST

నగరంలోని 10, 21వ డివిజన్లలో శుక్రవారం ఇం టింటికి తిరుగుతూ విదేశాల నుంచి వచ్చిన వారికోసం సర్వే నిర్వహించారు.

ప్రవాసీయుల కోసం నగరంలో సర్వే

ఖమ్మంటౌన్‌, మార్చి27: నగరంలోని 10, 21వ డివిజన్లలో శుక్రవారం ఇం టింటికి తిరుగుతూ విదేశాల నుంచి వచ్చిన వారికోసం సర్వే నిర్వహించారు. 21 డివిజన్‌ కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ ఆధ్వర్యంలో జడ్పీ కాలనీ, కవిరాజ్‌నగర్‌, కలెక్టర్‌ ఆఫీస్‌ వెనుకభాగంలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించగా 13 మంది విదేశాలనుంచి వచ్చినట్టు తెలిసింది. ఈవివరాలను వైద్యశాఖ డీఐవో డాక్టర్‌ అలివేలు మెడికల్‌ ఆఫీసర్‌ సౌమ్య డీటీ సురే్‌షకు అందించారు.


వారి కి తక్షణమే వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి రమ్మని కోరారు. ఈకార్యక్రమంలో సీవో అచ్యుతరామారావు, సర్వేటీంలీడర్‌ ప్రభాకర్‌, ఏఎన్‌ఎం గోపమ్మ, ఆర్‌పీ మల్లిక, అంగన్‌వాడీ టీచర్లు రాధిక, జ్యోతి, జవాన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో10వడివిజన్‌ శ్రీనగర్‌కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వ హించారు. ఈకార్యక్రమంలో ఆర్పీ శోభ, అంగన్‌వాడీ టీచర్‌ రాణి, కార్పొరేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T11:37:46+05:30 IST