మావోయిస్టుల కదలికలపై నిఘా

ABN , First Publish Date - 2020-03-18T12:08:56+05:30 IST

మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ జిల్లాలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, అడవులను జల్లెడ

మావోయిస్టుల కదలికలపై నిఘా

తెలంగాణకు వచ్చిన మావోయిస్టుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేసిన పోలీసులు గుండాల, మార్చి 17: మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ జిల్లాలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, అడవులను జల్లెడ పడుతున్నారు. భద్రాద్రికొత్తగూడెం-ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల సరిహద్దు అడవులను ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం వేట సాగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని పోలీసు స్టేషన్లను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ మంగళవారం పర్యటించారు. గుండాల, కొమరారం, ఆళ్లపల్లి, ఇల్లెందు పో లీస్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. మావోయిస్టు అగ్రనేతలతో పాటు ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు యాక్షన్‌ టీం లీడర్లు కుంజ వీరన్న అలియాస్‌ లచ్చన్న, లింగాల్‌ అలియాస్‌ రాకేష్‌, మం గు అలియాస్‌ పాండు, మంగ్తు, రాము అలియాస్‌ సుధీర్‌, అడుమాల్‌ అలియాస్‌ సంజీవ్‌ల ఫొటోలతో ఉన్న పోస్టర్లను, పోలీసులు గ్రామాల్లోని గోడలకు అంటించారు. మావోయిస్టు అగ్రనేతలైన జగన్‌, బడే దామోదర్‌, భద్రు సైతం సరిహద్దు అ డవుల్లోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, సరిహద్దు గ్రామాలపై నిఘా పెట్టారు.


మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ సునీల్‌దత్‌ అదేశాలు జారీ చేస్తూ, మారుమూల ప్రాంతాల స్టేషన్లను సందర్శించడంతో పోలీసులు మాజీల కదలికలపై నిఘా పెట్టారు. మారుమూల గ్రామాల్లోని కిరాణ షా  పుల్లో నిత్యవసర వస్తువులు విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వ స్తున్న అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల పోలీసులు సైతం మావో యిస్టుల ఏరివేతకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాయి. కరకగూడెం మండలంలోని నీలాంధ్రీపేటలో మావోలకు చెందిన సా మగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మావో యిస్టులు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు అడవుల్లో గాలింపు చర్యలు ఉధృతం చేయడంతో, గిరిజన పల్లెల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-03-18T12:08:56+05:30 IST