లాక్‌డౌన్‌కు సహకరించాలి: సండ్ర

ABN , First Publish Date - 2020-03-27T11:48:34+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేదుకుగానూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు లాక్‌డౌన్‌ ప్రకటించారని, దీనికి ప్రజలు

లాక్‌డౌన్‌కు సహకరించాలి: సండ్ర

సత్తుపల్లి, మార్చి 26: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేదుకుగానూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు లాక్‌డౌన్‌ ప్రకటించారని, దీనికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. గురువారం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌, విద్యుత్‌, వ్యవసాయశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిర్ణీత వేళల్లో దుకాణాల్లో కొనుగోళ్లు చేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రజలు తమకు అవసరమైన మేరకు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు.


పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనులపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో ఉన్న 15మంది వరకు యాచకులకు మునిసిపాలిటీ ద్వారా ప్రతిరోజూ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కజొన్న, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతు లు అమ్ముకునే వీలు ఉందని, దీనికి సంబంధించిన నిబంధనలు వ్యవసాయశాఖకు అందుతాయని చెప్పారు. అవసరమైతే సత్తుపల్లి మునిసిపాలిటీలో వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని ఫుడ్‌పార్క్‌లో రైతుల ధాన్యం నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు.


డయాలసిస్‌ రోగులకు పాస్‌లు

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకునేందుకు వచ్చే రోగులను అనుమతించాలని ఎమ్మె ల్యే వెంకటవీరయ్య కోరగా డయాలసిస్‌ రోగులకు పాస్‌లు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారని, ఆ మేరకు పాస్‌లు జారీ చేస్తామని తహసీల్దార్‌ మీనన్‌ ఎమ్మెల్యేకు వివరించారు.


మరో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు

సత్తుపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్‌లో కొనుగోలుదారులతో రద్దీగా ఉంటోంది. సామాజిక దూరం పాటించడం ఇబ్బందిగా మారింది. దీంతో పట్టణంలో మరో ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మునిసిపల్‌ కమిషనర్‌ కే.సుజాత, చైర్మన్‌ కూసంపూడి మహే్‌షలకు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని వాణీ విద్యాలయం ఆవరణను ఎమ్మెల్యే సండ్ర, ఏసీపీ ఎన్‌.వెంకటే్‌షతో కలసి గురువారం పరిశీలించారు. ఇదేప్రాంతంలో పాలు విక్రయించే వారికి కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే ఏసీపీకి సూచించారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న పాల విక్రయ కేంద్రాలతో పాటు అదనంగా పాలు విక్రయించే వారికి అవకాశం కల్పించాలని సూచించారు. 


Updated Date - 2020-03-27T11:48:34+05:30 IST