మాస్కుల్లో మస్కా

ABN , First Publish Date - 2020-03-28T11:46:09+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు లేకుండా బయటకు వెళ్లడం అసాధ్యంగా మారింది. అది కూడా ఎంతో నాణ్యంగా ఉంటే

మాస్కుల్లో మస్కా

నాణ్యత లేని మాస్కుల సరఫరా

చినిగిపోతున్న వస్త్రం, తెగుతున్న దారం

ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

వైద్యశాఖ ద్వారా ఇప్పటి వరకు 14వేల పంపిణీ

అధికారుల పర్యవేక్షణాలోపం ఫలితం

నాణ్యంగా ఉన్నవాటినే ఆమోదిస్తాం: ‘ఆంధ్రజ్యోతి’తో డీఎంహెచ్‌వో మాలతి


ఖమ్మంసంక్షేమవిభాగం, మార్చి 27: ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు లేకుండా బయటకు వెళ్లడం అసాధ్యంగా మారింది. అది కూడా ఎంతో నాణ్యంగా ఉంటే తప్ప వాడే పరిస్థితి లేదు. అలాంటిది రోజూ వందలాది మంది రోగులను చూసే వైద్య సిబ్బంది ఎంతటి నాణ్యమైన మాస్కులు వాడాలో చెప్పాల్సిన పనిలేదు. వాటిల్లో ఏమాత్రం నాణ్యత లేకున్నా అంతే సంగతులు. కానీ జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బందికి పంపిణీ చేసిన మాస్కుల్లో ఏ మాత్రం నాణ్యత లేదు. లాగితే వస్త్రం చినిగిపోతోంది. ముడివేస్తుంటేనే దారం తెగిపోతోంది. ఇలాంటి మాస్కులు ధరించి సిబ్బంది ఎలా విధులు నిర్వర్తిస్తారో అధికారులకే తెలియాలి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మాస్కులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ కర్ణన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతను మెప్మా, డీఆర్‌డీఏలోని మహిళా సంఘాలకు అప్పగించారు. కానీ నాణ్యతను పరిశీలించకపోవడంతో మాస్కుల్లో మస్కాకు తెరలేచింది.


కరోనా వైర్‌సను కట్టడి చేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వశాఖల ఉద్యోగులకు మాస్కులు అందించాలని కలెక్టర్‌ కర్ణన్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ మాస్కుల తయారీ, పంపిణీ నాణ్యతను పరిశీలించకపోవటం ఇప్పుడు విమర్శలకు గురిచేస్తొంది. మాస్కులు తయారీకి ముం దుగా ఖమ్మం నగరంలోని మె ప్మా, తర్వాత డీఆర్‌డీఏ శాఖలోని మహిళ సంఘాలకు తయారీ బాధ్యతలను అప్పగించారు. మాస్కుల న మూనాలను, నాణ్యతను జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రమాణాల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.


నాణ్యమైన వస్త్రంతో మాస్కులుకుట్టి, వాటికి దారాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఒప్పందం మేరకు రూ పొందించిన మాస్కులను రోజు వారీగా పరిశుభ్రం చేసి వాడేలా రూపొందించారు. కానీ మాస్కుల త యారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నాణ్యత లేని వస్త్రంతో పాటుగా దారాలను ఏర్పాటు చేసి పంపుతున్నారు. ఫలితంగా మాస్కులు నాణ్యతా లోపంపై విమర్శలు వెలువడుతున్నాయి. రోజు వారీగా వాడాల్సిన మాస్కులు ఒక్క రోజుకే వాటి దారాలు తెగిపోవటంతో పడేస్తున్నామని ప్ర భుత్వ శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


14వేల మాస్కుల పంపిణీ

వారం రోజుల్లోనే జిల్లా వైద్యఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వ శాఖలకు 14 వేల మాస్కులను పంపిణీ చేశారు. వీటిలో 11వేల మాస్కులు మెప్మా పరిధిలో రూపొందించారు. మూడు వేల మాస్కులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూపొందించారు. మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి జిల్లా వైద్యఆరోగ్యశాఖకు వచ్చిన మాస్కుల లెక్కలకు సరిపోవటం లేదు. తక్కువ మాస్కులను వైద్యశాఖకు అప్పగించి ఎక్కువ లెక్కల చూపి మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని విమర్శలు వెలువడుతున్నాయి.


నాణ్యమైన మాస్కులను ఇవ్వాలి..డాక్టర్‌ మాలతి, జిల్లా వైద్యాధికారి, ఖమ్మం

కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఉచితంగా ఇస్తాం. తప్పని సరిగా నాణ్య త మేరకు మాస్కులను పంపిణీ చేయాలి. మా స్కుల నాణ్యతను పరిశీలిస్తాం. నాణ్యత కలిగిన వాటిని మాత్రమే అమోదిస్తాం.

Updated Date - 2020-03-28T11:46:09+05:30 IST