ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-13T09:26:46+05:30 IST
రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. గురువారం మండలంలోని తుంబూరు, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సత్తుపల్లి, నవంబరు 12: రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. గురువారం మండలంలోని తుంబూరు, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టు ధర కల్పించాలనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, సర్పంచ్‌లు దరావత్ పుల్లమ్మ, మందపాటి రమాదేవి, ఎంపీటీసీ నిమ్మగడ్డ కృష్ణకుమారి, వైస్ సర్పంచ్ మొరంపూడి శ్రీనివాసరావు, కాల్నేని రాజేష్, కృష్ణమూర్తి, అప్పారావు, మోరంపూడి రవి, మేడా జగ్గారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు: మండలంలోని జీడీబీపల్లి, వాత్యానాయక్‌తండా, లింగాల, యర్రబోయినపల్లి గ్రామాల్లో గురువారం ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల వెంకటశేషగిరిరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ, జడ్పీటీసీలు బీరవల్లి రఘు, కట్టా అజయ్‌కుమార్, సొసైటీ అధ్యక్షుడు బోబోలు లక్ష్మణ్‌రావు, పాలెపు రామారావు, కీసర వెంకటేశ్వరరెడ్డి, రైతుబంధు ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డాక్టర్ లక్కినేని రఘు, సర్పంచ్‌లు బాణోతు మణి, దేవరపల్లి అరుణ, సింగిశాల పద్మప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకుడు దేవరపల్లి భాస్కర్‌రావు, రైతులు పాల్గొన్నారు.