23న సోలార్‌ విద్యుదుత్పత్తి ప్రారంభం: జీఎం

ABN , First Publish Date - 2020-12-16T04:30:57+05:30 IST

సింగరేణి ఇల్లెందు ఏరియాలో రూ.170 కోట్లతో నిర్మాణం పూర్తి చేసిన సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు.

23న సోలార్‌ విద్యుదుత్పత్తి ప్రారంభం: జీఎం

ఇల్లెందుటౌన్‌, డిసెంబరు 15: సింగరేణి ఇల్లెందు ఏరియాలో రూ.170 కోట్లతో నిర్మాణం పూర్తి చేసిన సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు. ఈ మేర కు మంగళవారం సింగరేణి ఈఅండ్‌ఎం డైరెక్టర్‌ సత్యనా రాయణ ఏరియా అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో 39 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తిలో 15మేగా వాట్లను 23న సింగరేణి డే సందర్భంగా ప్రారంబించి పవర్‌గ్రీడ్‌కు అనుసందానం చేయనున్నట్లు వెల్లడించారు. ఇల్లెందు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అవసరమైన విద్యుత్‌ను సోలార్‌ ప్లాంట్‌ ద్వారా పొందనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఇల్లెందు ఏరియాకు చెందిన పలువురు అఽధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T04:30:57+05:30 IST