మిస్టరీగా మారిన బాలుడి గల్లంతు

ABN , First Publish Date - 2020-06-22T10:34:00+05:30 IST

గోదావరిలో గల్లంతైన బాలుడి ఆచూకి ఆరోజులు గడిచిన తెలియరాలేదు. దీంతో బాలుడి గల్లంతు వ్యవహరం మిస్టరీగా మారింది.

మిస్టరీగా మారిన బాలుడి గల్లంతు

ఆరురోజులుగా దొరకని ఆచూకి

గాలింపు విరమించిన కుటుంబసభ్యులు


భద్రాచలంటౌన్‌, జూన్‌ 21: గోదావరిలో గల్లంతైన బాలుడి ఆచూకి ఆరోజులు గడిచిన తెలియరాలేదు. దీంతో బాలుడి గల్లంతు వ్యవహరం మిస్టరీగా మారింది. పట్టణంలోని అంబసత్రం కాలనీకి చెందిన గొంతున తులసీరామ్‌, పవన్‌కుమార్‌ ఈ నెల 17న వినాయక నిమజ్జనం చేసే రేవులో గోదావరిలో బాలుతో అడుకుంటు ప్రవాహంలోకి వెళ్లిపోయి గల్లంతైన విషయం తెలిసిదే. వీరిద్దరి కొసం ముమ్మరంగా గాలిపుచర్యలు చేపట్టగా రెండవ రోజు పవన్‌కుమార్‌ మృతదేహం లభించింది. కాని నేటివరకు తులసీరామ్‌ మృతదేహం లభించలేదు. దీంతో గజ ఈతగాలకు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో కుటుంబసభ్యులు గాలింపుచర్యలు సైతం నిలిపిచేశారు.


కాగా ఈ ఇద్దరు గల్లంతైనట్లు ప్రత్యక్షంగా ఎవరు చూడకం పోవడంతో తులసీరామ్‌ ఎటైన పారిపోయాడా అనే అనుమానాలను సైతం కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. వీరు గోదావరిలో గల్లంతైన సమయంలో వీరితో పాటు వచ్చిన తులసీరామ్‌ బంధువులు మరో ఇద్దరు కూడా ఘటన జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయారు. పవన్‌కుమార్‌ నీటిలో మునిగిపోవడంతో ఇద్దరితో పాటు తులసీరామ్‌కు వెళ్లాడా అనే అనూమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారిద్దరు వచ్చి ఈ విషమై సమాచారం ఇస్తేనే ఈ ఘటనపై ఓ పూర్తి ఆవగాహన వస్తుందని తులసీరామ్‌ కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-06-22T10:34:00+05:30 IST