ప్రశాంతంగా సింగరేణి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-03-02T12:11:39+05:30 IST

సింగరేణి సంస్థలో 68మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీకి ఆదివారం మధ్యాహ్నం

ప్రశాంతంగా సింగరేణి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష

ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం, మార్చి 1: సింగరేణి సంస్థలో 68మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీకి ఆదివారం మధ్యాహ్నం 2గంటలనుంచి 4గంటలవరకు సింగరేణి యాజమాన్యం రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 22,222 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 8,747మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఉమ్మ డి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలో 36 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలను సోమవారం (2తేదీన) సింగరేణి వెబ్‌సైట్‌తో పాటు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్‌ మెయిన్‌గేట్‌ నోటీస్‌ బోర్డు వద్ద ఉంచుతామని సింగరేణి అధికారులు తెలిపారు.


పరీక్ష నిర్వహణను సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ పా) ఎస్‌. చంద్రశేఖర్‌, జీఎం (పర్సనల్‌ ఆర్‌సీ అండ్‌ ఐఆర్‌) ఎ. ఆనందరావు పరిశీలించారు. ఈ రాత పరీక్షకు ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒరిస్సా, తదితర రాష్ట్రాల నుంచి అభ్యర్థులు నాన్‌లోకల్‌ కేటగిరీలో హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ రాత పరీక్షలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పలువురు నకిలీ అభ్యర్థులు పట్టుబడ్డట్లు సమాచారం.

Updated Date - 2020-03-02T12:11:39+05:30 IST