ఓసీలో పనితీరు, రక్షణ చర్యలు తప్పనిసరి
ABN , First Publish Date - 2020-12-18T04:53:14+05:30 IST
సింగరేణి ఓసీపీలలో భారీ యంత్రాల పనితీరు, రక్షణ చర్యలను తప్పనిరసరిగా పర్యవేక్షించాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) కే.విజయ్‌కుమార్ సూచించారు.

సింగరేణి డీఎంఎస్ విజయ్‌కుమార్
సత్తుపల్లిరూరల్, డిసెంబరు 17: సింగరేణి ఓసీపీలలో భారీ యంత్రాల పనితీరు, రక్షణ చర్యలను తప్పనిరసరిగా పర్యవేక్షించాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) కే.విజయ్‌కుమార్ సూచించారు. జేవీఆర్ ఓసీని సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో జీఎంలు నరసింహారావు, కొండయ్య, వైజీకే.మూర్తి, ఏరియా ఇంజనీర్ రఘురామరెడ్డి, రక్షణాధికారి నాగేశ్వరరావు, డీజీఎం శ్రీనివాసాచారి, కిష్టారం ఓసీ పీవో వీ.కృష్ణయ్య, మేనేజర్ వీ.రామసుబ్బారెడ్డి, ఎస్‌ఈ ఆనంద్, ప్రాజెక్టు ఇంజనీర్ లక్ష్మణమూర్తి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ బీ.రమణారెడ్డి పాల్గొన్నారు.
జా క్రషర్ ప్రారంభం
జేవీఆర్ ఓసీ కోసం రూ.కోటితో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యత పరీక్షకు ఉపయోగించే టూ స్టేజ్ జా క్రషర్ యంత్రాన్ని కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.నరసింహారావు ప్రారంభించారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏరియా క్వాలిటీ మేనేజర్ మదన్‌మోహన్‌రావు, డీజీఎం బీ.శ్రీనివాసాచారి, మేనేజర్ వీ.రామసుబ్బారెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్ ఐవీఎ్‌సబీ.లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.