సింగరేణి అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్
ABN , First Publish Date - 2020-12-21T04:16:39+05:30 IST
కొత్తగూడెం ప్రకాశం స్టేడి యం గ్రౌండ్‌లో ఆదివారం సింగరేణి కార్పొరేట్, కొత్త గూడెం ఏరియా ఉన్నతాధికారుల మధ్య పరిమిత ఓవర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది.

కొత్తగూడెం, డిసెంబరు 20: కొత్తగూడెం ప్రకాశం స్టేడి యం గ్రౌండ్‌లో ఆదివారం సింగరేణి కార్పొరేట్, కొత్త గూడెం ఏరియా ఉన్నతాధికారుల మధ్య పరిమిత ఓవర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం ఏరియా జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 102 పరుగులను సాధించగా, ఈ లక్ష్యాన్ని కార్పోరేట్ జట్టు 12 ఓవర్లలోనే సాధించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) ఎన్. బలరాం, బెస్ట్ బౌలర్‌గా కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్. నరసింహారావు, బెస్ట్ ఆల్ రౌండర్‌గా డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్. చంద్రశేఖర్‌లు ఎంపిక కాగా, జీఎం (పర్చేస్) కేవీ రమణమూర్తి బహుమతులు అందించారు. అనంతరం ఇరు జట్ల క్రీడాకారులు రమణ మూర్తిని ఘనంగా సన్మానించారు. కొత్తగూడెం ఏరియా జట్టుకు డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్. చంద్రశేఖర్, కార్పొరేట్ జట్టుకు డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) ఎన్. బలరాం కెప్టెన్లుగా వ్యవహరించారు. పీవీకే 5షాఫ్ట్ డీజీఎం పాలడుగు శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఎంపైర్, వ్యాఖ్యతగా స్పోర్ట్స్ సూపర్‌వైజర్ డి. సుందర్‌రాజ్, ఆర్గనైజర్ స్పోర్ట్స్ సూపర్‌వైజర్ ఎంసీ పోస్‌నెట్‌లు వ్యవహ రించారు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో రెండు జట్ల క్రీడాకారులు ఎంతో చక్కటి క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పాల్గొన్నారు.