ఇల్లెందు ఏరియాలో 90శాతం ఉత్పత్తి
ABN , First Publish Date - 2020-12-02T02:37:44+05:30 IST
సింగరేణి ఇల్లెందు ఏరియాలో నవంబరు మాసంలో 90శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ తెలిపారు.
ఇల్లెందుటౌన్, డిసెంబరు 1: సింగరేణి ఇల్లెందు ఏరియాలో నవంబరు మాసంలో 90శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్ధానిక జీఎం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఏరియాలోని జెకె5ఓసి, కోయగూడెం ఓసిలలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 90శాతం మేర సాధించినట్లు ప్రకటించారు. నవంబరు మాసంలో 5.63లక్షల టన్నులకుగాను 5.09లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేసినట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయిన బొగ్గును రోడ్డు మార్గం, రైల్వే మార్గంలో రవాణా చేసినట్లు తెలిపారు. రవాణాతోపాటు ఏరియాలో 7.34లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిల్వచేసినట్లు తెలిపారు. బొగ్గు ఉత్పతిలో సమిష్టి కృషి చేసిన ఏరియా అధికారులు, కార్మికులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో కార్మికులు ఐక్యంగా పని చేయాలని కోరారు. అందరి కృషి, సహకారంతోనే 90 శాతం ఉత్పత్తి సాధించామని తెలిపా రు. ఇందులో కార్మికుల భాగస్వామ్యం బాగా ఉం దని అన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు జీఎం పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆ యన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఏరి యా అధికారులు ప్రభాకర్‌రావు, గిరిధరావు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.