ఇంట్లో పేకాట ఆడుతున్నారని ఎస్‌ఐ జులూం
ABN , First Publish Date - 2020-04-01T11:01:19+05:30 IST
ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న కారణంతో ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్‌ఐ సతీ్‌షకుమార్ అదే మండలంలోని వనంవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై జులుం చూపించారు.

విచక్షణారహితంగా కొట్టిన ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్‌ఐ
ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
ఖమ్మంక్రైం/ముదిగొండ, మార్చి 31: ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న కారణంతో ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్‌ఐ సతీ్‌షకుమార్ అదే మండలంలోని వనంవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై జులుం చూపించారు. ఎస్‌ఐ సతీ్‌షకుమార్ స్వయంగా వారిని బజారులో మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టిన లాఠీతో తీవ్రంగా కొట్టడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈవిషయాన్ని ఖమ్మం పోలీసుకమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తీవ్రంగా పరిగణించారు. ముదిగొండ ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌ను బదిలీ చేస్తూ ఏఆర్‌కు అటాచ్ చేశారు.
మార్చి28న వనంవారికృష్ణాపురంలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్‌ఐ సతీ్‌షకుమార్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను బయటకు తీసుకువచ్చి మోకాళ్లపై కూర్చోబెట్టారు. వారి వెనుకభాగంలో లాఠీతో కొడుతూ దుర్భాషలాడారు. ఆ తర్వాత ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సీపీ ఆ ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆయన్ను ఏఆర్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందించాలని సీపీ ఖమ్మంరూరల్ ఏసీపీని ఆదేశించారు.
తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు
బూర్గంపాడు, మార్చి 30: లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, చికెన్, మాంసం తూకాల్లో వ్యత్యాసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి డీటీ కస్తాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆరు వాహనాల సీజ్
తల్లాడ, మార్చి 31: అకారణంగా తల్లాడ ప్రధాన రహదారులపై సంచరిస్తున్న వాహనదారుల వాహనాలను మంగళవారం ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి సీజ్ చేశారు. అకారణంగా సంచరిస్తున్న ఆరు వాహనాలను సీజ్‌చేసి కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దనే ఉండి కోవిడ్-19వ్యాప్తి నివారణకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలపై అకారణంగా సంచరించొద్దని ఎస్‌ఐ హెచ్చరించారు.