పాఠశాలలకు విద్యుత్‌శాఖ షాక్
ABN , First Publish Date - 2020-12-16T04:38:47+05:30 IST
అసలే పాఠశాలలకు గ్రాంటులులేవు. కరెంట్ బిల్లులు కట్టడమే భారమైంది.

స్మార్టు మీటర్లకు అదనపు బిల్లులు కట్టాలంటూ నోటీసులు
మధిర, డిసెంబరు 15: అసలే పాఠశాలలకు గ్రాంటులులేవు. కరెంట్ బిల్లులు కట్టడమే భారమైంది. ఈసమయంలో ప్రభుత్వం ఆదేశాలంటూ గత విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌శాఖవారు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చారు. ప్రభుత్వం చెప్పింది అంటే అంతా ఫిట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ మీటర్లకు రూ. 8687లు అదనపు రుసం చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కట్టకుంటే బిల్లులో కలిసి వస్తుందని ఆనోటీసుల్లో పేర్కొన్నారు. మూడు దఫాలుగా బిల్లుతో కలిసి కట్టాల్సివస్తుందని తెలిపారు. బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లాన్ చేశారు. దీంతో అసలు కరెంట్ బిల్లులు కట్టడానికే తమకు బడ్జెట్ లేక ఇబ్బందులుపడుతున్నాం. ఇప్పుడు మీటర్‌కు అదనపు రుసుం అంటూ ఈ తాఖీదులేంటని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ అదనపు రుసుములు తాము కట్టలేమని ప్రభుత్వం కల్పించుకొని ఈ నోటీసులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈమేరకు మధిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సోమవారం నోటీసులు రావడంతో హెచ్ ఎం ప్రభుధయాళ్ జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. అలాగే ఇతర పాఠశాలలకు కూడా స్మార్ట్‌మీటర్ రుసుములంటూ నోటీసులు అందటంతో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు లబోదిబో మంటున్నారు. జిల్లాఅధికారులు, ఈ బారం పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని రద్దు చేయాలని విజ్ఙప్తి చేస్తున్నారు.